ఏపీలోని కూటమి ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది. కొత్తగా నియమితులైన ప్రభుత్వ ఉద్యోగినులు ప్రసూతి సెలవులు తీసుకున్నా ప్రొబేషన్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపింది. ఈ మేరకు ప్రసూతి సెలవులను డ్యూటీగా పరిగణిస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఇదివరకు రెగ్యులర్ మహిళా ఉద్యోగులకు మాత్రమే మాతృత్వ సెలవులు ఉండేవి. తాజాగా సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రభుత్వ ఉద్యోగినులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీలోని మహిళా ఉద్యోగులకు తీపి కబురు.. ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
RELATED ARTICLES