Monday, April 14, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఉత్తమ వ్యవసాయ యాజమాన్య పద్ధతులను అనుసరిస్తే మంచి దిగుబడి

ఉత్తమ వ్యవసాయ యాజమాన్య పద్ధతులను అనుసరిస్తే మంచి దిగుబడి

ఏపీఎస్ఓపి సీఏ ఎవల్యూటోర్.. బి. వెంకటేష్.
విశాలాంధ్ర ధర్మవరం:: రైతులందరూ ఉత్తమ వ్యవసాయ యాజమాన్య పద్ధతులను అనుసరిస్తే మంచి దిగుబడి వస్తుందని ఏపీ ఎస్ఓపి సీఏ ఇవిలేటర్ బి. వెంకటేష్ తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ సత్య సాయి జిల్లాలోని పలు గ్రామాలతో పాటు మండల పరిధిలోని ఆకుతోటపల్లి, చింతలపల్లి రైతుల యొక్క పొలాలను వారు పరిశీలించారు. ఇందు జిఏపీ సర్టిఫికేషన్ కోసం బాటమ్మ స్వామి రైతు ఎన్ఎసిఎస్ లిమిటెడ్ ద్వారా ఏపీఎస్ఓపి సీఏకు నమోదు చేసుకోబడిన డివిజన్ పరిధిలోని 29 మంది రైతుల పొలాలను కూడా వారు పరిశీలించారు. రసాయన ఎరువులు పురుగుల మందులను సిఫారసు మేరకు మాత్రమే వాడాలని రైతులకు సూచించారు. విత్తన ధ్రువీకరణ ప్రాముఖ్యతను కూడా వారు తెలియజేశారు. పురుగుల మందుల అవశేషాల పరీక్ష నిమిత్తం విత్తన నమూనాలను సేకరించి ల్యాబ్ కు పంపించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సీఈవో మారుతి, ఎన్ ఎం ముస్తఫా, టెక్నికల్ అడ్వైజర్ ఉపేందర్ రెడ్డి, ఏఈఓ బత్తలపల్లి, వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు