ప్రిన్సిపాల్ ప్రశాంతి
విశాలాంధ్ర ధర్మవరం;; ఇంటర్మీడియట్ ఫలితాలలో ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రతిభ చాటడం జరిగిందని ప్రిన్సిపాల్ ప్రశాంతి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ద్వితీయ సంవత్సరములో 75 మంది విద్యార్థులకు గాను 46 మంది విద్యార్థులు ఉత్తీర్ణత కావడంతో 61 శాతం సాధించడం జరిగిందన్నారు. సీఈసీ గ్రూపులో ఎం. శాంతప్ప 863 మార్కులు, ఎమ్మెల్సీ గ్రూపులో ఎస్ మహమ్మద్ అయూబ్ 897 మార్కులు, ఎంపీసీలో ఎస్ ప్రశాంత్ కుమార్ 823 మార్కులు, సిరికల్చర్ గ్రూపులో ఏ. పురుషోత్తం821 మార్కులు సాధించడం జరిగిందన్నారు. అదేవిధంగా ప్రధమ సంవత్సరములో 168 మందికి గాను 34 మంది ఉత్తీర్ణత సాధించి 20 శాతము నమోదు కావడం జరిగిందన్నారు. ఎంపీసీ గ్రూపులో ఎస్. ఆరిఫ్ రహమాన్ మాలిక్ 446 మార్కులు, ఎమ్మెల్ టీ గ్రూపు నందు డి ఫరూక్ 453, ఈ టీ గ్రూపు నందు జి. వినోద్ 436 మార్కులు సంపాదించడం జరిగిందన్నారు. వీరందరికీ ప్రిన్సిపాల్ తో పాటు అధ్యాపకులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. అనుతీర్ణులైన విద్యార్థులు అందరినీ కూడా మే నెలలో జరిగే సప్లమెంటరీ పరీక్షల్లో ప్రత్యేక తర్ఫీదు ఇచ్చి ఉత్తీర్ణత అగునట్లు చర్యలు గైకొంటామని తెలిపారు.
ఇంటర్ ఫలితాలలో ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల విద్యార్థులు..
RELATED ARTICLES