విశాలాంధ్ర ధర్మవరం :: శ్రీ సత్య సాయి జిల్లా ప్రభుత్వ జూనియర్ అధ్యాపకుల అసోసియేషన్ కమిటీ ను సమావేశం తర్వాత ఎన్నుకున్నారు. తొలుత ప్రాథమిక సభ్యుల సమస్యలను చర్చించడం జరిగింది. అనంతరం నూతన కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు. నూతన కార్యవర్గ కమిటీలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఎన్నికల ఆఫీసర్గా జోనల్ సెక్రెటరీ జోన్-4, ఏపీ నాయకులు బిఎం వయాజ్ భాషా నిర్వహించారు. అనంతరం ఎన్నికల ఆఫీసర్ నూతన కమిటీని అధికార పూర్వకంగా ప్రకటించారు. ఈ నూతన కమిటీలో అధ్యక్షులుగా బి. రామకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షులుగా టీ. గీత, కార్యదర్శిగా కే. నాగభూషణ, సహకార దర్శిగా రమేష్ రెడ్డి, కోశాధికారిగా ఎస్.నాగరాజు, మహిళ కార్యదర్శిగా టి. సునీత, స్టేట్ కౌన్సిల్ సభ్యులుగా విఎల్ సుమన్ లాల్ నాయక్ ఎన్నుకోవడం జరిగింది. అనంతరం నూతన కమిటీ నియామక పత్రాలను విడుదల చేశారు. నూతన కమిటీ మాట్లాడుతూ ప్రభుత్వ ఆధ్యాపకుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిష్కరిస్తూ, ప్రభుత్వం ద్వారా చర్చలు జరిపి, సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.
ప్రభుత్వ జూనియర్ అధ్యాపకుల అసోసియేషన్ కమిటీ ఏర్పాటు
RELATED ARTICLES