విశాలాంధ్ర – బాపట్ల : రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి బాపట్లలో చేపడుతున్న సేవలను ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రశంసించారు. సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే బాపట్ల జిల్లాను అగ్రగామిగా నిలిపినందుకు బాపట్ల జిల్లా కలెక్టర్ కలెక్టర్ జె వెంకట మురళి కి అవార్డు, పతకాన్ని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రదానం చేశారు. గురువారం ఏపీ రాజభవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ వెంకట మురళి అవార్డును అందుకున్నారు. గడిచిన ఏడాది కాలంలో బాపట్ల జిల్లాలో 1,200 మందిని రెడ్ క్రాస్ సభ్యులుగా చేర్పించారు. జిల్లాకు రూ.12 లక్షలు సొమ్మును సభ్యత్వ నమోదుతో రెడ్ క్రాస్ సంస్థకు ఆర్థిక వనరులను పెంచారు. అలాగే వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడాన్ని గవర్నర్ ప్రత్యేకంగా అభినందించారు. ఇటీవల కృష్ణానది వరద విపత్తు సమయంలోనూ బాపట్ల జిల్లాలో ఎలాంటి ప్రాణ హాని జరగకుండా ముందస్తు ప్రణాళికతో జాగ్రత్త చర్యలు తీసుకున్నారని ప్రశంసించారు. ఆ సమయంలో ప్రజలకు విశేషంగా సేవలందించినందుకు జిల్లా కలెక్టర్ ను ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నుంచి రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ నారాయణ భట్టు, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ వెంకట మురళిని ప్రశంసించిన గవర్నర్
RELATED ARTICLES