శ్రామిక జిల్లా కన్వీనర్ దిల్షాద్
విశాలాంధ్ర ధర్మవరం; రాష్ట్రంలో పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని ధర్మవరం పట్టణంలో కళాజ్యోతి సర్కిల్ అంబేద్కర్ విగ్రహం ముందు సిఐటియు, సిపిఎం ప్రజా సంఘాలు ఆందోళన చేశారు. శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ దిల్షాద్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు విద్యుత్ చార్జీలు పెంచమని అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఆరు నెలల వ్యవధిలో విద్యుత్ చార్జీలో పెంచడం అన్యాయమని అన్నారు. పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల ప్రజలపై ఈ విద్యుత్తు చార్జీల పెంపు ప్రభావం అధికంగా ఉంటుందని తక్షణమే విద్యుత్ చార్జీల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం పెంచిన విద్యుత్ చార్జీల బిల్లులను భోగిమంటల్లో వేసి కాల్చివేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పాల్గొన్నారు.
పెంచిన విద్యుత్ ఛార్జీలను ప్రభుత్వం వెంటనే తగ్గించాలి..
RELATED ARTICLES