విశాలాంధ్ర-రాజాం : ఈ రోజు రాజాం ది సన్ స్కూల్ లో యూకేజీ విద్యార్థులకు స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఈఓ యాగటి దుర్గారావు, ఎమ్మార్వో ఎస్.కృష్ణంరాజు, పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె.అశోక్ కుమార్ పాల్గొని విద్యార్థులకు సర్టిఫికేట్ అందించారు. విద్యార్థులు చక్కని నడవడిక, క్రమశిక్షణతో మంచి విద్యార్థులుగా ఎదిగా సమాజానికి కృషి చేయాలని వీరు తెలిపారు. విద్యార్థులు, శ్లోకాలు, పద్యాలు, స్టోరీస్ చక్కగా అలరించారు. ప్రిన్సిపల్ వై. భారతి మాట్లాడుతూ విద్యార్థుల తల్లి దండ్రుల సహకారం మరియు ఉపాధ్యాయుల కృషితో విలువలతో కూడిన విద్యను విద్యార్థులకు అందిస్తున్నాము. చెప్పారు. విద్యార్థులు వివిధ రకాల పాటలు, నృత్యాలతో అందరిని అలరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.