Saturday, January 11, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఘనంగా వడ్డే ఓబన్న జయంతి వేడుకలు

ఘనంగా వడ్డే ఓబన్న జయంతి వేడుకలు

ఎంపీడీవో సాయి మనోహర్, తాసిల్దార్ నటరాజ్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో కలెక్టర్ ఆదేశాల మేరకు స్వాతంత్ర సమరయోధులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సేనాధిపతి వడ్డే ఓబన్న జయంతి వేడుకలను ఎంపీడీవో సాయి మనోహర్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. అనంతరం వారి చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ఇటువంటి గొప్ప వ్యక్తికి ఘన నివాళులు అర్పించడం ఒక అదృష్టం అని తెలిపారు. బ్రిటిష్ వలస పాలకుల ఆగడాలు దౌర్జన్యాలకు వ్యతిరేకంగా మొట్టమొదటి స్వాతంత్ర పోరాటం జరిపిన రేనాటి యోధుడు వడ్డే ఓబన్న అని తెలిపారు. ఆయన చరిత్ర చిరస్మరణీయం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
తహసిల్దార్ కార్యాలయంలో;; వడ్డే ఓపెన్ నా జయంతి వేడుకలు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా తాసిల్దార్ నటరాజ్ ఆధ్వర్యంలో చిత్రపటానికి అధికారులు సిబ్బంది పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ శిస్తు వసూలు విషయంలో బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులకు రేనాటి పాలేగాలకు మధ్య ఘర్షణల సందర్భంగా చేసిన పోరాటంలో వడ్డే ఓబన్న సైన్యాధ్యక్షుడిగా పనిచేయడం జరిగిందన్నారు. వడ్డే గోపన్న వీరోచితంగా పోరాడడం జరిగిందన్నారు. సమాజ హితం కోసం వడ్డే ఓబన్న చేసిన సేవలు మరువలేనివి అని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ సురేష్ కుమార్, ఎన్నికల తాసిల్దార్ ఈశ్వరయ్య, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు