విశాలాంధ్ర -ధర్మవరం ; పట్టణంలోని తారకరామాపురంలో గల జానకి రాముల దేవాలయ అభివృద్ధి కమిటీ భక్త బృందం ఆధ్వర్యంలో జానకి రామాలయం ఆలయంలో జానకి రాముల విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవ వేడుకలు ఆలయ కమిటీ, భక్తాదులు, దాతల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమాలు ఈనెల 5వ తేదీ నుండి ఏడవ తేదీ వరకు జరుగుతున్నాయని, ఇందులో చివరి రోజు మహాగణపతి, వేణుగోపాల స్వామి, జానకి, రామ, లక్ష్మణ ,ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు అర్చకుల వేద మంత్రాలు మంగళ వాయిద్యాలు నడుమ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన భక్తాదులకు దాతలకు కమిటీ వారు ప్రతి ఒక్క కృతజ్ఞతలను తెలియజేశారు.
ఘనంగా జానకి రాముల విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవ వేడుకలు.. ఆలయ కమిటీ
RELATED ARTICLES