సుబ్రహ్మణ్యేశ్వర నాగదేవతల భక్తాదులు
విశాలాంధ్ర ధర్మవరం: పట్టణములోని ఎస్ఎల్వీ మార్కెట్ (పాత బస్టాండ్) లోగల సుబ్రహ్మణ్యేశ్వర నాగదేవతల ఆలయంలో రథోత్సవ వేడుకలు సుబ్రహ్మణ్య షష్టి పూజ కార్యక్రమాలు ఘనంగా అర్చకులు, భక్తాదులు నడుమ ఘనంగా నిర్వహించారు. తొలుత ఉదయం పాలాభిషేకం వెండి కవచ సమర్పణ దేవాలయ సన్నిధి ప్రవేశం మహా నివేదన తదితర కార్యక్రమాలను ఆలయ అర్చకులు విజయ్ కుమార్ శర్మ వారి శిష్య బృందం , భక్తాదుల ఆధ్వర్యంలో వేదమంత్రాలు మంగళ వాయిద్యాలు నడుము నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ధర్మవరం నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్, జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు చిలకం మధుసూదన్ రెడ్డి, ఎన్డీఏ కార్యాలయ మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబు పాల్గొని, స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించుకున్నారు. అనంతరం అర్చకులు ఆలయ భక్తాదుల బృందం ముఖ్య అతిథులకు ఘనస్వాగతం పలికి, అర్చకులు వారి పేరిటన అర్చనలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఘనంగా రథోత్సవ వేడుకలు..
RELATED ARTICLES