Friday, April 11, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపోతుకుంట గ్రామంలో ఆర్వో ప్లాంట్‌కు భూమిపూజ

పోతుకుంట గ్రామంలో ఆర్వో ప్లాంట్‌కు భూమిపూజ

ఈ ఆర్వో ప్లాంట్ ద్వారా గ్రామంలో త్రాగునీరు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. – మంత్రి నియోజకవర్గ ఇన్‌చార్జ్ హరీష్ బాబు
విశాలాంధ్ర ధర్మవరం:;- ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్ సహకారంతో, సంస్కృతి సేవాసమితి ఆధ్వర్యంలో ధర్మవరం నియోజకవర్గంలోని పోతుకుంట గ్రామంలో రివర్స్ ఆస్మోసిస్ ఆర్వో ప్లాంట్‌ను ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఈ సందర్భంగా గురువారం గ్రామంలో అంగరంగ వైభవంగా భూమిపూజ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి మంత్రి నియోజకవర్గ ఇన్‌చార్జ్ హరీష్ బాబు ముఖ్య అతిథిగా హాజరై, భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామ ప్రజలకు పరిశుద్ధమైన త్రాగునీరు అందించడం మంత్రి గారి ముఖ్య లక్ష్యం అని, వారి మార్గదర్శకత్వం, అహర్నిశ కృషి వల్లే ఈ మంచి పని కార్యరూపం దాల్చింది అని పేర్కొన్నారు. ఈ ఆర్వో ప్లాంట్ ద్వారా గ్రామంలో త్రాగునీరు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుందని, ప్రజల ఆరోగ్య పరిరక్షణలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయి, గ్రామస్తులు మంత్రి సహకారానికి , సంస్కృతి సేవాసమితికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ శుద్ధి నీటి ప్లాంట్ ద్వారా తమ ఆరోగ్య భద్రతకు తోడ్పాటు లభిస్తుందన్న నమ్మకంతో హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాన్ని మరింత పురోగతిపథంలో నడిపించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పోతుకుంట రాజు, జయరాం ,సూరి , బిలె శ్రీనివాసులు, సుబ్బారావు పేట పవన్ కుమార్ రెడ్డి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు