Saturday, February 15, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిచేనేత సమస్యలను పరిష్కరించాలని ఆరోగ్యశాఖ మంత్రి కి చేనేత కార్మిక సంఘం వినతి..

చేనేత సమస్యలను పరిష్కరించాలని ఆరోగ్యశాఖ మంత్రి కి చేనేత కార్మిక సంఘం వినతి..

జిల్లా అధ్యక్షులు పోలా లక్ష్మీనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటనారాయణ.
విశాలాంధ్ర ధర్మవరం;; చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్ర ప్రదేశ్ చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పోలా లక్ష్మీనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి బుడగ వెంకటనారాయణ లు ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ కి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రస్తుతం ధర్మవరంలో చేనేత పరిశ్రమ, ఈ పరిశ్రమలు నమ్ముకున్న చేనేత కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, ఆదుకోవలసిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని వారు తెలిపారు. చేనేత కార్మికులకు ఎన్నికల హామీలైన నేతన్న నేస్తం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును వెంటనే అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని వారు తెలిపారు. జిల్లా చేనేత జౌళి శాఖ కార్యాలయమును ధర్మవరంలో ఏర్పాటు చేయాలని, చేనేత కార్మికులకు హెల్త్ కార్డు ద్వారా వైద్య సదుపాయం కల్పించాలని, 11 రకాల చేనేత ఉత్పత్తుల రిజర్వేషన్ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని, చేనేతపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని, ఆదరణ పథకాన్ని పునరుద్దించి వృత్తి పరికరాలను సబ్సిడీలతో పంపిణీ చేయాలని, చేనేత ఉత్పత్తులకు ప్రభుత్వమే మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని, చేనేతలకు ప్రత్యేక బ్యాంకులను ఏర్పాటు చేసి సబ్సిడీ రుణాలను తొందరగా మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని వారు తెలిపారు. చేనేతకు రాష్ట్ర బడ్జెట్లో 1000 కోట్లు కేటాయించాలని, చేనేతలకు మూడు సెంట్లు స్థలము ఇచ్చి, పక్కా ఇండ్లు వర్క్ షెడ్డు ప్రభుత్వమే ఉచితంగా నిర్మించాలని తెలిపారు. రెండు లక్షల వరకు ముద్ర రుణాలు ఇస్తూ ఇచ్చిన ప్రతిసారి సబ్సిడీ ఇవ్వాలని తెలిపారు. స్పందించిన మంత్రి మాట్లాడుతూ మీ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లి తగిన న్యాయం చేస్తానని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు వెంకటస్వామి, ఆదినారాయణ, శ్రీనివాసులు, మంజుల బాల రంగయ్య, జిల్లా సహాయ కార్యదర్శి చెన్నంపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు