Wednesday, December 11, 2024
Homeజిల్లాలుఅనంతపురంహంద్రీనీవా కాలువను వెడెల్పు చేసి ఆయకట్టుకు నీరు ఇవ్వాలి

హంద్రీనీవా కాలువను వెడెల్పు చేసి ఆయకట్టుకు నీరు ఇవ్వాలి

సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి సి. మల్లికార్జున జిల్లా కలెక్టర్ కు వినతులు

విశాలాంధ్ర- అనంతపురం: హంద్రీనీవా లైనింగ్ కాదు 10 వేల క్యూసెక్కులకు కాలువ ను వెడెల్పు చేసి ఆయకట్టుకు నీరు ఇవ్వాలి అని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి సి. మల్లికార్జున సోమవారం జిల్లా
గ్రీవెన్స్ లో కలెక్టర్ వి. వినోద్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా చిరు తుల మల్లికార్జున మాట్లాడుతూ… హంద్రీనీవా కాలువను 10 వేల క్యూసెక్కులకు పెంచాలని ఎన్నికల హామీని అమలు పరచకుండా జీడిపల్లి నుండి లైనింగ్ చేయడం అంటే జిల్లా ప్రజానీకానికి రైతాంగానికి తీవ్ర అన్యాయం చేసినట్లు ఆరోపించారు. ఈరోజు లైనింగ్ పనులు ఆపాలని ఎన్నికల హామీ మేరకు కాలువను పదివేల క్యూసెక్కులకు పెంచాలని ఆయకట్టుకు నీరు ఇవ్వాలని అనంతపురం జిల్లాకు హంద్రీనీవా ప్రాజెక్టు జిల్లాకు ఒకవరం లాంటిదని నిత్యం కరువు కాటకాలతో అల్లాడుతున్న జిల్లాకు హంద్రీ నీవ ద్వారా త్రాగునీరు సాగునీరు అందించాలని డిజైన్ చేసినారన్నారు. ప్రస్తుతం వస్తున్న నీరు వల్ల త్రాగునీరుతోపాటు భూగర్భ జలాలు పెరిగి బోరుబావుల క్రింద ఆయకట్టుకు నీరు వస్తుందన్నారు. ప్రస్తుతం వస్తున్న 40 టీఎంసీ లకు ఉన్న కాలువను కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంలో పదివేల క్యూసెక్కులకు కాలువను పెంచుతామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఆ హామీని అమలుపరచకుండా ప్రస్తుతం జీడిపల్లి నుండి కాలువను లైనింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో జిల్లా రైతాంగము ప్రజలలో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని ఇప్పటికింకా ఆయకట్టుకు నీరు ఇవ్వకుండా కేవలం కాలువకు మాత్రమే నీరు ఇస్తున్నారు అన్నారు. పిల్ల కాలువలు కూడా ఏర్పాటుc చేయలేదు కానీ ఈ నీరును ముందుకు తీసుకుపోవడం అంటే జిల్లా ప్రజలకు అన్యాయం చేయడమే అన్నారు. ఎక్కువగా రాప్తాడు నియోజకవర్గం లో 75 వేల ఎకరాలకు ఆయకట్టు ఉన్న ఉపయోగము లేకపోవడమే గాక కాలువ కింద భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉందన్నారు. జిల్లా ప్రయోజనాలు పూర్తి అయిన తర్వాతనే లైనింగ్ కానీ కాలువ ముందుకు నీరు పంపితే బాగుంటుందని పేర్కొన్నారు. అందుకోసమే ముందుగా కాలువను 10 వేల క్యూసెక్కులకు పెంచాలని ఆయకట్టు నీరు ఇవ్వాలని ఇచ్చిన తరువాత నీరు ముందుకు తీసుకొని పోయి జిల్లాకు న్యాయం చేయాలని కోరడం జరిగిందన్నారు. వరుస కరువలతో ఇబ్బందులు పడుతున్న రైతులు పంటలు పండక అప్పుల భారమై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. జిల్లా ప్రజా ప్రతినిధులు జోక్యం చేసుకొని రైతాంగాన్ని ఆదుకోవాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ప్రజలను రైతులను కలుపుకొని ఉద్యమాలకు శ్రీకారం చుడుతామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి పి రామకృష్ణ, సహాయ కార్యదర్శి జి శ్రీకాంత్, రైతు సంఘం నాయకులు బుల నగేష్, నియోజకవర్గ కార్యదర్శి ఏ ధనుంజయ, సిపిఐ నాయకులు దుర్గాప్రసాద్, రైతు సంఘం నాయకులు వెంకట్రాముడు, ఆంజనేయులు, పి వెంకట్ రాముడు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు