Friday, May 23, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

విశాలాంధ్ర -ధర్మవరం; పట్టణంలోని ఆంజనేయస్వామి దేవాలయాలలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు అర్చకులు, ఆలయ కమిటీ , భక్తుల అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు. ఇందులో భాగంగా పట్టణంలోని చెరువు కట్ట వీధిలో గల శ్రీ జీవి ఆంజనేయస్వామి దేవస్థానంలో హనుమాన్ జయంతి వేడుకలు అర్చకులు చంద్రకాంతచార్యులు శ్రీనివాసచార్యులు, కమిటీ, భక్తతుల నడుమ ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేకంగా అర్చనలు, పూజలు, వివిధ అభిషేకాలు నిర్వహించారు. అనంతరం విగ్రహానికి వివిధ పూలమాలతో పాటు వడమాల కార్యక్రమాన్ని కూడా నిర్వహించిన వైనం భక్తాజులను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం తీర్థప్రసాదాల కార్యక్రమంతో ముగిసింది. తదుపరి శ్రీనివాస నగర్ లో గల శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయములో అర్చకులు రాజేష్ ఆచార్యులు, భక్తాదులు, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. అనంతరం స్వామివారిని వివిధ పూలమాలలతోనూ, తులసి మాలలతోనూ, వడమాలతో అలంకరించిన వైనం అందరినీ ఆకట్టుకుంది. తొలుత అర్చనలు, ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంతో ముగిసింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు