ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్టు పెట్టారు. నదీ స్నానాలు, ఉపవాసం, జాగరణ దీక్షలను అత్యంత నిష్ఠతో ఆచరిస్తున్న భక్తులకు ఆ శంకరుడు సకల శుభాలను, ఆనంద ఆరోగ్యాలను అనుగ్రహించాలని కోరుకుంటున్నాను అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. కాగా, ఏపీ, తెలంగాణలో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇప్పటికే మహాశివరాత్రి కోసం ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ పర్వదినం సందర్భంగా భారీ ఎత్తున భక్తులు ఆలయాలకు తరలివచ్చే అవకాశం ఉండటంతో అందుకు తగ్గట్టుగా భారీగానే ఏర్పాట్లు చేశారు. ఇక భక్తులు తెల్లవారుజామునే ఆలయాలకు తరలివచ్చి శివుడిని దర్శించుకుంటున్నారు. దీంతో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు
RELATED ARTICLES