విశాలాంధ్ర- వలేటివారిపాలెం : వలేటివారిపాలెం మండలంలోని చుండి మరియు అయ్యవారిపల్లి గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం మండల వ్యవసాయ అధికారి ఎం హేమంత్ భరత్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు.ఈ సందర్బంగా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ ప్రస్తుతం మినుము కోతలు జరుగుతూ ఉన్నవి మినుము అనంతరం నువ్వు పంట సాగు చేసుకుంటే లాభదాయంగా ఉంటుందని అలాగే ప్రస్తుతం నువ్వులు మార్కెట్లో 13,000రూపాయలు నుండి 14,000రూపాయలు వరకు మంచి గిట్టుబాటు ధర ఉంది కాబట్టి మినుము అనంతరం నువ్వు పంట సాగు చేసుకోవలసినదిగా సూచించటమైనది కావలసిన విత్తనాలు నువ్వుల రకాలు వై ఎల్ ఎం 146 మరియు వై ఎల్ ఎం 66 రకాలు చిన్న పావని రీసెర్చ్ స్టేషన్ నందు అందుబాటులో ఉన్నవి కావలసిన రైతులు మీ గ్రామ పరిధిలోని గ్రామ వ్యవసాయ సహాయకులను సంప్రదించవలసినదిగా తెలియజేయడమైనది అలాగే ఈ రబీలో సాగు చేసిన పంటలన్నీ ఈ పంట నమోదు చేయించుకోవలసినదిగా తెలియజేయడమైనది ఈ పంట నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే సున్నా వడ్డీ పంట రుణాలు, అలాగే పంటల భీమా చెల్లించి ఉన్న రైతులకు పంటల బీమా పొందాలి అంటే ఈ పంట నమోదు తప్పనిసరి మీ గ్రామ పరిధిలోని వ్యవసాయ ఉద్యానవన సహాయకులను సంప్రదించి ఈ పంట నమోదు చేయించుకోవలసినదిగా సూచనలు ఇవ్వడం జరిగింది అలాగే అనంతరం చుండి గ్రామంలోని చెరువుపల్లి ప్రభాకర్ మినుము పొలంలో వ్యవసాయ సహాయకులు పంట కోత ప్రయోగం నిర్వహించడం జరిగింది రైతులతో కలిసి 5 * 5 మీటర్లు మార్కింగ్ చేసుకొని దానిలో వచ్చిన దిగుబడిని ఇన్సూరెన్స్ కంపెనీ వారికి తెలియజేయడం జరుగుతుంది దాని ద్వారా భీమా చెల్లించిన రైతులకు పంటల భీమా పొందే అవకాశం ఉంటుందని పంటకోత ప్రయోగాల్లో వచ్చిన దిగుబలను బట్టి ఇన్సూరెన్స్ క్యాలిక్యులేషన్ జరుగుతుందని తెలియజేశారు .ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ ఉద్యానవన సహాయకులు పి.నాగరాజు, సిహెచ్ రవీంద్ర అయ్యవారిపల్లి గ్రామ సర్పంచ్ డేగ వెంకటేశ్వర్లు మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు.