Friday, December 27, 2024
Homeజిల్లాలుశ్రీ సత్యసాయివిద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభించిన ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్

విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభించిన ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్

ధర్మవరం : మండల పరిధిలోని కునుతూరు గ్రామంలో 11 కె.వి 3 ఫేష్ సబ్ స్టేషన్ ను ధర్మవరం నియోజకవర్గ ఎమ్మెల్యే, ఆరోగ్య శాఖామంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ సబ్ స్టేషన్ ప్రారంభంతో కునుతురు తదితర గ్రామాలకు విద్యుత్ సరఫరా మెరుగుపడటంతో పాటు ప్రాంతీయ అభివృద్ధికి కొత్త ఒరవడిని అందించే అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. ఈ సదుపాయం ప్రజలకు మరింత వసతులు మంచి సేవలు అందించడంలో కీలకపాత్ర పోషించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్య సాయి జిల్లా టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి, రూరల్ మండల కన్వీనర్ మహేష్ చౌదరి, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు