Monday, May 12, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయివీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియల్లో పాల్గొన్న వైద్య ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్

వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియల్లో పాల్గొన్న వైద్య ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్

విశాలాంధ్ర -ధర్మవరం;ఆపరేషన్ సిందూర్ లో భాగంగా దేశం కోసం ప్రాణాలర్పించిన శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండాకు చెందిన వీరజవాన్ మురళీనాయక్ అంత్యక్రియల్లో ధర్మవరం ఎమ్మెల్యే, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. కళ్లితండాలోని నివాసం వద్ద మురళీనాయక్ పార్థీవదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి తో పాటు వివిధ శాఖల మంత్రులు, ఎన్డీఏ నాయకులు, జిల్లా అధికారులు, టిడిపి, బిజెపి, జనసేన నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు