Tuesday, July 1, 2025
Homeఆంధ్రప్రదేశ్జగన్ క్వాష్ పిటిషన్ పై నేడు విచారణ

జగన్ క్వాష్ పిటిషన్ పై నేడు విచారణ

వైసీపీ అధినేత జగన్ పై నమోదైన రెంటపాళ్ల కేసుకు సంబంధించి దాఖలైన క్వాష్‌ పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. తనపై రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ కేసు నమోదు చేశారని, దానిని కొట్టివేయాలని కోరుతూ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం వాదనలు విననుంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామంలో ఇటీవల జగన్‌ పర్యటిస్తున్న సమయంలో సింగయ్య అనే వైసీపీ కార్యకర్త జగన్ ప్రయాణిస్తున్న వాహనం కింద పడిపోయి చనిపోయాడు. ఈ నేపథ్యంలో జగన్ సహా పలువురిపై కేసు నమోదయింది. ఈ కేసును పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనదిగా పేర్కొంటూ జగన ఇతర నిందితులు కోర్టును ఆశ్రయించారు. తమపై పెట్టిన కేసును రద్దు చేయాలని కోరుతూ వేర్వేరుగా క్వాష్‌ పిటిషన్లు దాఖలు చేయగా, వాటన్నింటినీ కలిపి ఉన్నత న్యాయస్థానం విచారిస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు