తొలగించిన మున్సిపల్ కార్మికులు
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని పలు ప్రాంతాలలో గురువారం అర్ధరాత్రి సమయంలో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలతో పాటు ప్రధాన రహదారుల్లో వర్షం కు నీరు నిలిచిపోవడంతో ఆయా వార్డు ప్రజలు ఎన్నో ఇక్కట్లను ఎదుర్కొన్నారు. తదుపరి మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ ద్వారా సమాచారం అందుకున్న ఎన్డీఏ కార్యాలయ, మంత్రి ఇంచార్జ్ హరీష్ బాబు మున్సిపల్ సిబ్బందితో పలుచోట్ల వారు మంత్రి ఆదేశాల మేరకు పరిశీలించడం జరిగింది. తదుపరి పారిశుద్ధ్య కార్మికులతో కాలువల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించుట, అనంతరం కాలువల్లో నీరు సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకొనుట జరిగింది. అనంతరం వాటిని ట్రాక్టర్లు, జెసిబిల సహాయంతో మొత్తం తొలగించడం జరిగింది. దీంతో ఆయా వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.