Thursday, May 8, 2025
Homeఆంధ్రప్రదేశ్గంగోత్రి యాత్రకు వెళుతుండగా కూలిపోయిన హెలికాప్టర్..ఆరుకి పెరిగిన మృతుల సంఖ్య

గంగోత్రి యాత్రకు వెళుతుండగా కూలిపోయిన హెలికాప్టర్..ఆరుకి పెరిగిన మృతుల సంఖ్య

ప్రమాద మృతుల్లో అనంతపురం ఎంపీ సోదరి

ఆధ్యాత్మిక యాత్రకు వెళుతున్న భక్తులు హెలికాప్టర్ ప్రమాదానికి గురైన దుర్ఘటన ఉత్తరాఖండ్ లో చోటుచేసుకుంది. ఉత్తరకాశీ జిల్లా గంగ్నాని వద్ద హెలికాప్టర్ కూలిపోయిన ఘటనలో మృతుల సంఖ్య ఆరుకి పెరిగింది. మృతుల్లో అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ సోదరి కూడా ఉన్నట్టు గుర్తించారు. ఆమె పేరు వేదవతి కుమారి. వేదవతి కుమారి గంగోత్రి యాత్రకు వెళుతూ మృత్యువాతపడ్డారు. ఈ హెలికాప్టర్ ప్రమాదంలో వేదవతి కుమారి భర్త వ్యక్తి ఎం.భాస్కర్ (51) గాయపడ్డారు. అతడిని రుషికేశ్ లోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఏపీకి చెందిన విజయారెడ్డి అనే మహిళ కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు విడిచారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు