విశాలాంధ్ర ధర్మవరం; మండల పరిధిలోని తిప్పేపల్లి గ్రామంలో గ్రామస్తులు నీటి కొరతతో ఎన్నో తీవ్ర ఇబ్బందులకు గురి అయ్యేవారు. దీంతో హైకోర్టు కేంద్ర ప్రభుత్వ న్యాయవాది అంజన్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులు చేతిబోరు రిపేరు చేశారు. గత ఆరు నెలలుగా చేతి బోరు పంపు చెడిపోయి గ్రామస్తులు నీటి కొరకు ఎన్నో ఇక్కట్లకు గురి అయ్యే వారిని గ్రామ పూర్వ పిన్న పెద్ద వెంకటనారాయణ రెడ్డి, సాకే కాశి విశ్వనాధ్ తెలిపారు. ఈ సందర్భంగా గ్రామములోని నాగభూషణ, కృష్ణారెడ్డి, పాలన్న,రాజారెడ్డి ,నారాయణస్వామి, చిన్న కేశప్ప, గ్రామ ప్రజలు హైకోర్టు న్యాయవాది అంజన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.
గ్రామస్తుల నీటి కొరతను పరిష్కరించిన హైకోర్టు న్యాయవాది
RELATED ARTICLES