పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో మాజీ మంత్రి హరీశ్ రావును అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. అరెస్టు మినహా తదుపరి దర్యాప్తు చేపట్టవచ్చని స్పష్టం చేసింది. దర్యాప్తునకు సహకరించాలని హరీశ్‌రావుకు సూచించింది. హరీశ్‌పై ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేత చక్రధర్‌గౌడ్‌కు నోటీసులు జారీసింది. విచారణను రెండు వారాలు వాయిదా వేసింది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న హరీశ్ రావును అక్రమ కేసుల్లో ఇరికించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ సిద్దిపేట కాంగ్రెస్ ఇన్‌చార్జి చక్రధర్ గౌడ్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో హరీశ్‌రావుపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎఫ్ఐఆర్‌ను క్వాష్ చేయాలంటూ హైకోర్టులో హరీశ్‌రావు పిటిషన్ దాఖలు చేశారు. పంజాగుట్ట పీఎస్‌లో తనపై తప్పుడు కేసు నమోదు చేశారని అందులో పేర్కొన్నారు. రాజకీయ దురుద్దేశంతో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారని ఆయన తెలిపారు. నా ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్‌పై ముందుకు వెళ్లకుండా స్టే ఇవ్వాలని కోర్టును కోరారు. ఈనేపథ్యంలో హరీశ్ రావును అరెస్టు చేయవద్దని పోలీసులకు హైకోర్టు స్పష్టం చేసింది.
హరీశ్ రావుకు ఊరట.. అరెస్ట్ చేయవద్దంటూ హైకోర్టు ఆదేశం
RELATED ARTICLES