బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విచారణ కోసం బషీర్‌బాగ్ ఈడీ కార్యాలయానికి వచ్చిన నేపథ్యంలో ఆయనతో పాటు బిఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకున్నారు.. ముందు జాగ్రత్తగా భారీగా పోలీసులు మోహరించారు.. ఈడీ కార్యాలయం రోడ్డును బారికేడ్లతో మూసివేశారు.. అయినప్పటికీ బిఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఈడీ కార్యాలయంలోకి వేళ్లేందుకు ప్రయత్నించారు.. బీఆర్‌ఎస్ నేతలు, పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ సందర్భంగా పోలీసులు లాఠీలు ఝుళిపించారు. అలాగే మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, సీనియర్ నేత క్రిశాంక్ తో పాటు పలువురు మహిళా కార్పొరేటర్లను, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని వారిని పోలీస్ వాహనాలలో వేరే ప్రాంతాలకు తరలించారు.
ఈడీ కార్యాలయం వద్ద హై టెన్షన్.. బిఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అరెస్ట్
RELATED ARTICLES