Thursday, April 17, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఈ నెల 11న మున్సిపల్ కార్యాలయం దగ్గర ధర్నా జయప్రదం చేయండి

ఈ నెల 11న మున్సిపల్ కార్యాలయం దగ్గర ధర్నా జయప్రదం చేయండి

సిపిఐ నియోజక వర్గ కార్యదర్శి ముసుగు మధు
విశాలాంధ్ర ధర్మవరం:: ఈనెల 11వ తేదీన మున్సిపల్ కార్యాలయము దగ్గర ధర్నాను జయప్రదం చేయాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణం లోని ఎన్జీవో హోమ్ నందు, ఏఐటీయూసీ, భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ప్లంబర్స్ అండ్ ఎలక్ట్రిషన్స్, కార్మికుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా చేతి వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు జింకా చలపతి , సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు హాజరయ్యారు. ఈ సమావేశంలో సిపిఐ నియోజక వర్గ కార్యదర్శి ముసుగు మధు మాట్లాడుతూ 650-2 సర్వే నంబర్ లో జరిగిన అవినీతి అక్రమాలపై అనేకసార్లు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి అనర్హులైన వారు డూప్లికేట్ పట్టాలు చేయించుకుని కట్టడాలు నిర్మిస్తున్నారు అని తెలిపారు. వారి పట్టాలను వెంటనే తొలగించి నిజమైన ప్లంబర్ కార్మికులకు న్యాయం చేయాలని కలెక్టర్, ఆర్డిఓ, తాసిల్దార్ , మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. అయితే ఏ ఒక్క అధికారి నుండి ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమని తెలిపారు. ఇప్పటికైనా రెవిన్యూ, మున్సిపాలిటీ అధికారులు స్పందించి నిజమైన కార్మికులకు న్యాయం చెయ్యకపోతే మున్సిపల్ కార్యాలయాన్ని కార్మికులను కలుపుకొని పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని ఈ సందర్భంగా వారి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవికుమార్, సహాయ కార్యదర్శి ఎర్రంశెట్టి రమణ, చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, బుడగ వెంకటనారాయణ, యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సకల రాజ,ప్లంబర్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు, గోవింద రాజులు, అన్నం లక్ష్మీనారాయణ, ఆర్గనైజింగ్ కార్యదర్శి, ఆంజనేయులు, తాజ్, రామ సుబ్బయ్య, చిన్న, మసూద్, సురేంద్ర, నాగేంద్ర, దాదా పీర్, రామకృష్ణ, శివయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు