Tuesday, January 7, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిబ్రెయిలీ జన్మదిన వేడుకల్లో అందులకు సన్మానం..

బ్రెయిలీ జన్మదిన వేడుకల్లో అందులకు సన్మానం..

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ
విశాలాంధ్ర ధర్మవరం : బ్రెయిలీ జన్మదిన వేడుకల్లో భాగంగా పట్టణంలోని రిటైర్డ్ కంటి వైద్యాధికారి, మధు కంటి వైద్యశాల లో నలుగురు అందులకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి రెడ్ క్రాస్ సొసైటీ సంస్థ చైర్మన్ డాక్టర్ నరసింహులు, వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, కార్యదర్శి శివయ్య, కోశాధికారి డాక్టర్ సత్య నిర్ధారన్ లో మాట్లాడుతూ బ్రెయిలీ జన్మదినం సందర్భంగా అందులకు సన్మానం చేయడం మా అదృష్టంగా భావిస్తామని తెలిపారు. నేటి సమాజంలో అన్ని రంగాలలో అందులో కూడా రాణించడం గర్వించదగ్గ విషయమని తెలిపారు. దివ్యాంగులను, అందులను ప్రతి ఒక్కరూ ప్రేమతో, గౌరవంగా పలకరించినప్పుడే వారిలో మరింత చైతన్యం రావడం జరుగుతుందని, సమాజానికి మేము సైతం అంటూ ముందడుగు వేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సంస్థ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు