విశాలాంధ్ర ధర్మవరం:: శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తిలో ఉగాది పండుగను సందర్భంగా చేసుకొని జిల్లాలోని వివిధ అర్చకులకు కలెక్టర్ చేతన్ చేతులమీదుగా ఘన సన్మానమును నిర్వహించారు. ఇందులో ధర్మవరం మండలం కూతురు గ్రామంలోని శ్రీ చెన్నకేశవ వినాయక ఆంజనేయ స్వామి దేవస్థానం యొక్క అర్చకులు ఎం. శాంతేశ్వర ప్రసాద్కు ను కలెక్టర్ సన్మానించడం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమంలో హిందూపురం మండలం సంతే బిందనూర్ గ్రామానికి చెందిన పి. నారాయణమూర్తి అర్చకులు, దక్షిణామూర్తి స్వామి దేవస్థానం అర్చకులు సత్యనారాయణ శాస్త్రి, బుక్కపట్నం మండలం పి కొత్తకోట గ్రామానికి చెందిన వెంకటేశ్వర స్వామి దేవస్థానం అర్చకులు పంచరత్నం సుబ్రహ్మణ్య శర్మ లను ఘనంగా సత్కరించడం జరిగింది. దేవాదాయ శాఖ తరపున 62 సంవత్సరాలు పైబడిన అర్చకులకు ఒక్కొక్కరికి పదివేల 116 రూపాయలతో పాటు ప్రశంసా పత్రం పంచే కండువా పండ్లు దేవాదాయశాఖ తరఫున కలెక్టర్ చే పంపిణీ చేస్తూ శాలువా కప్పి సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ధర్మవరం చెన్నకేశవ స్వామి గుడి, దుర్గమ్మ తల్లి ఆలయం ఈవో వెంకటేశులు, అడహక్కు కమిటీ చైర్మన్ చెన్నం శెట్టి జగదీశ్వర ప్రసాద్ అర్చకులకు అభినందనలు తెలుపుతూ, జిల్లా కలెక్టర్ చైతన్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.