Friday, February 21, 2025
Homeజిల్లాలుఅనంతపురంఅర్హులైన ప్రతి పేదవానికి ఇంటి స్థలాలు ఇవ్వాలని ధర్నా

అర్హులైన ప్రతి పేదవానికి ఇంటి స్థలాలు ఇవ్వాలని ధర్నా

టిట్కో ఇండ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలి.
అర్హులైన ప్రతి పేదవానికి రేషన్ కార్డులు పంపిణీ చేయాలి.
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్

విశాలాంధ్ర-తాడిపత్రి (అనంతపురం జిల్లా): పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయం వద్ద సిపిఐ పట్టణ కార్యదర్శి చిరంజీవి యాదవ్ ఆధ్వర్యంలో మంగళవారం నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హాజరై పేదల ద్వారా స్వీకరించిన ఇంటి స్థలాల దరఖాస్తులను తాసిల్దార్ రజాక్ వలికి అందజేశారు. అనంతరం మీడియా ముఖంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ పేదలకు న్యాయ పరంగా అందాల్సిన ఇంటి జాగా, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం అందించి ఎన్నికల హామీ నిలబెట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. రాష్ట్రంలో పేదరికం కొట్టుమిట్టాడుతున్నందుకే రాష్ట్రవ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో పేదల పక్షాన పోరు బాటకు సన్నద్ధ మయిందన్నారు. పేదలకు ఇంటి స్థలాలు పంపిణీ చేయాల్సిన, పేదల చిరకాల వాంఛ, బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. పేదల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సిపిఐ పార్టీ చూస్తూ ఊరకుండదని, పేదలతో కలిసి పోరాటం కొనసాగిస్తామన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టిట్కో ఇండ్ల నిర్మాణం ప్రారంభించారు. కానీ అవి పూర్తి కాకపోవడం, అధికారంలోకి వచ్చిన వైసిపి టిట్కో ఇండ్లను పట్టించుకోలేదన్నారు. మరల నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. కావున ఇప్పుడు టిట్కో ఇండ్ల నిర్మాణాన్ని పూర్తిచేసి లబ్ధిదారులకు పంపిణీ చేయాలని కోరారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఇంకా ఎంతో మంది పేదలు రేషన్ కార్డు లేకుండా ఉన్నారని, క్షేత్రస్థాయి లో పరిశీలించి అర్హులైన ప్రతి పేదవానికి రేషన్ కార్డులు పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా మండల, పట్టణ, నగరాలలో నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇప్పించే కార్యక్రమం సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టామని, ప్రత్యేకించి తాడిపత్రిలో మాత్రమే నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇచ్చే కార్యక్రమం చేపట్టలేదని అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్యే, చైర్మన్ సిపిఐ పార్టీని అపార్థం చేసుకుంటున్నారు. సిపిఐ పార్టీ నిత్యం ప్రజల పక్షాన ఉంటూ పోరాడు తుందే తప్ప ఎవరికి విరుద్ధం కాదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర నాయకులు డి. జగదీష్ సిపిఐ జిల్లా కార్యదర్శి సి. జాఫర్, సహాయ కార్యదర్శి నారాయణస్వామి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శి టి.రంగయ్య, కేశవరెడ్డి సిపిఐ తాడిపత్రి నియోజకవర్గ ఇన్చార్జి రాజారెడ్డి పేద ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు