సిపిఐ జిల్లా సహకార దర్శి సి. మల్లికార్జున
విశాలాంధ్ర -అనంతపురం : రాష్ట్ర ప్రభుత్వం త్వరలో పేదలకు ఇంటి పట్టాలు అందజేయాలని సిపిఐ జిల్లా సహకార దర్శి సి మల్లికార్జున పేర్కొన్నారు. సోమవారం రాప్తాడు నియోజకవర్గం కార్యవర్గ సమావేశాన్ని నీలం రాజశేఖర్ రెడ్డి భవన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాప్తాడు నియోజకవర్గం సహాయ కార్యదర్శి శ్రీకాంత్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా సహకార దర్శి సి.మల్లికార్జున పాల్గొన్నారు. నియోజకవర్గ సహాయ కార్యదర్శి శ్రీకాంత్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గత వైసిపి ప్రభుత్వం హయాంలో పేదలకు గ్రామాల్లో ఒకటిన్నర సెంట్లు, పట్టణాల్లో ఒక సెంటు చొప్పున ఇళ్ల స్థలాలు పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఆయా ఇళ్ల స్థలాలు పట్టణాలకు సుదూరంగా నివాసయోగం కానీ ప్రాంతాలలో కేటాయించడం జరిగిందన్నారు. అందులో చాలా మంది పేదలకు ఇప్పటివరకు ఇళ్ల స్థలాలు చూపు లేదని ప్రభుత్వం ఇచ్చిన ఒక సెంటు స్థలం పేదల నివాసానికి ఏమాత్రం సరిపోదని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆనాడే వైసిపి ప్రభుత్వానికి చెప్పినప్పటికీ ఖాతారు చేయలేదన్నారు. నాటి ప్రభుత్వం మొండిగా ముందుకెళ్లిందని కాకి లెక్కలతో 32 లక్షల మందికి పట్టాలు ఇచ్చినప్పటికీ పేదల స్థలాలు పట్ల సుమకత చూప లేదని పైగా ఇంటి నిర్మాణానికి ఇచ్చే ఆర్థిక సాయం రూ.1,80 వెలు మాత్రమే ప్రకటించడం జరిగిందన్నారు. ఈ ఆర్థిక సాయంతో పునాదులు కూడా పూర్తి చేయలేని స్థితిలో పేదలు కూడా ఇంటి నిర్మాణం చేపట్టలేదని వైసీపీ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు పట్టాలు నిరూపియోగంగా మారిందన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల ముందు గ్రామాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్లు చొప్పున స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారని పేదలకు వాటి అమలు చేయాలన్నారు. రాష్ట్రంలో రేషన్ కార్డులు పెన్షన్లు అర్హులైన వాళ్ళు చాలామంది ఉన్నారని వాళ్ళని పరిశీలించి వెంటనే పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు చొప్పునమంజూరు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ రాప్తాడు నియోజకవర్గం కార్యదర్శి రామకృష్ణ, సిపిఐ రూరల్ మండల కార్యదర్శి రమేష్, ఆత్మకూరు మండల కార్యదర్శి రామకృష్ణ, మండల సహాయ కార్యదర్శి నరేష్, ఆత్మకూరు మండల సహాయ కార్యదర్శి శివ,ఏఐవైఎఫ్ రాప్తాడు నియోజకవర్గం ధనుంజయ,ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యూ నియోజకవర్గ కార్యదర్శి శారద, నియోజకవర్గ కార్యవర్గ నాయకుల దుర్గాప్రసాద్ అజయ్ కుళ్లాయప్ప రాజు, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు