Homeఅంతర్జాతీయంనడిచైనా బంగ్లాకు వస్తా.. ఉరిశిక్ష ఉన్నా వెనక్కి తగ్గని షేక్ హసీనా

నడిచైనా బంగ్లాకు వస్తా.. ఉరిశిక్ష ఉన్నా వెనక్కి తగ్గని షేక్ హసీనా

- Advertisement -

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన ప్రకటన చేశారు. విద్యార్థుల తిరుగుబాటుతో పదవి కోల్పోయి ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్న ఆమె, డిసెంబర్ 16న తిరిగి తన దేశానికి వెళ్లనున్నట్లు ప్రకటించారు. ఆమెపై బంగ్లాదేశ్‌లో మరణశిక్ష అమలు ఆదేశం ఉన్నప్పటికీ ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. 2024 ఆగస్టులో జరిగిన భారీ ప్రజా ఉద్యమంతో 15 ఏళ్ల హసీనా పాలన ముగిసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమె ఢిల్లీకి చేరుకున్నారు. ఇప్పుడు 1971 విమోచన యుద్ధ విజయానికి గుర్తుగా జరుపుకొనే ‘విజయ్ దివస్్ణ రోజైన డిసెంబర్ 16న తిరిగి బంగ్లాదేశ్‌లో అడుగుపెట్టాలని ఆమె భావిస్తున్నారు. ఢిల్లీ నుంచి తన ప్రయాణాన్ని బంగ్లాదేశ్ ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని హసీనా కోరుతున్నారు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే, సాధారణ విమానంలో లేదా అవసరమైతే నడుచుకుంటూ అయినా దేశంలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నారని ఆమె సహాయకుడు అబూ ఒబైదా అరిన్ ఃబీబీసీఃకి తెలిపారు. ఈ వ్యాఖ్యలు ఆమె దృఢ సంకల్పాన్ని తెలియజేస్తున్నాయి. ప్రజా ఉద్యమాన్ని అణచివేసే క్రమంలో మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై బంగ్లాదేశ్ ప్రభుత్వం హసీనాకు మరణశిక్ష విధించింది. విద్యార్థుల నిరసనల సమయంలో భద్రతా బలగాల చేతిలో దాదాపు 1,400 మంది మరణించినట్లు ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. ఈ నేపథ్యంలో హసీనా తిరిగి వస్తే వెంటనే అరెస్టు చేసి, మరణశిక్షను అమలు చేస్తామని అక్కడి ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆమెకు చెందిన అవామీ లీగ్ పార్టీపై కూడా నిషేధం కొనసాగుతోంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు