టూ టౌన్- సీఐ. రెడ్డప్ప
విశాలాంధ్ర ధర్మవరం:: విధుల యందు ప్రతి డ్రైవరు ఏకాగ్రతను ఉంచినట్లయితే ప్రమాదాలకు అవకాశం ఉండదని టూ టౌన్- సిఐ. రెడ్డప్ప తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఆర్టీసీ డిపోలో రోడ్డు భద్రత మాసం ఉత్సవాల కార్యక్రమానికి వారు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా వారు రోడ్డు భద్రత మాసొస్తవాల పట్ల పలు విషయాలను తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు నియమ నిబంధనలు కూడా తెలపడం జరిగిందని తెలిపారు. ప్రమాదాలకు అవకాశం లేకుండా సురక్షితమైన ప్రయాణమును చేసినప్పుడే ప్రయాణికులకు ఆర్టీసీ సంస్థ మీద పూర్తి నమ్మకం ఉంటుందని తెలిపారు. డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ఫోన్లో మాట్లాడడం పూర్తిగా మానివేయాలని, అదేవిధంగా విధులకు చేరేటప్పుడు తాము ప్రయాణించే టూ వీలర్ లో కూడా అతి జాగ్రత్తగా ప్రయాణించి సరి అయిన సమయంలో విధులకు చేరాలని తెలిపారు. ప్రస్తుతం ఆర్టీసీ బస్సులలో ప్రమాదాలు అతి తక్కువ శాతం జరుగుతున్నాయని, రోడ్డు వైపు ఎంతోమంది అవగాహన లేని వారు కూడా వస్తుంటారని అలాంటప్పుడు మనం మరింత జాగ్రత్తతో డ్రైవింగ్ చేయాలని వారు సూచించారు. తదుపరి డ్రైవర్ల యొక్క అనుమానాలను కూడా వారు నివృత్తి చేశారు. తదుపరి డిపో మేనేజర్ సత్యనారాయణ మాట్లాడుతూ మన ధర్మవరం డిపో ప్రమాద రహిత డిపోగా కృషి చేసేందుకు డ్రైవర్ల అందరూ కూడా సమన్వయంతో, ఐక్యమత్యంతో, పూర్తి అవగాహనతో విధులు నిర్వర్తించాలని తెలిపారు. విధులలో చేరేటప్పుడు పూర్తి ఆరోగ్యంతో ఉండాలని తెలిపారు. కుటుంబ సమస్యలను దృష్టిలో ఉంచుకొని డ్రైవింగ్ చేస్తే అనుకోని ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రమాదాలు చెప్పి రావని, ప్రమాదాలు జరగకుండా చూసుకోవలసిన బాధ్యత డ్రైవర్ల దేనిని తెలిపారు. ఇందుకు కుటుంబ సభ్యులు కూడా సహకరించినప్పుడే పూర్తి దశలో విధులు నిర్వర్తించే అవకాశం ఉందని తెలిపారు. డ్రైవింగ్ లో, రోడ్డు భద్రత విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సూపర్వైజర్, గ్యారేజ్ సూపర్వైజర్, ఆర్టీసీ ఉద్యోగులు 45 మంది పాల్గొన్నారు.
విధుల యందు ప్రతి డ్రైవరు ఏకాగ్రత ఉంటే ప్రమాదాలకు అవకాశం ఉండదు
RELATED ARTICLES