Homeఅంతర్జాతీయంక్యూబాకు చమురు విక్రయిస్తే.. టారిఫ్‌లు తప్పవు

క్యూబాకు చమురు విక్రయిస్తే.. టారిఫ్‌లు తప్పవు

- Advertisement -

ట్రంప్ హెచ్చరికలు

క్యూబా లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ దేశానికి చమురు విక్రయించే ఏ దేశంపైనైనా టారిఫ్‌లు విధిస్తానని హెచ్చరించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై ఆయన సంతకం కూడా చేశారు. క్యూబా విషయంలో జాతీయ అత్యవసర పరిస్థితి కింద ట్రంప్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ దేశ ప్రభుత్వం అమెరికా జాతీయ భద్రతకు, విదేశాంగ విధానానికి తీవ్రమైన ముప్పుగా మారిందని పేర్కొన్నారు. ఈ తాజా ఉత్తర్వులు శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. ట్రంప్ తాజా చర్య మెక్సికో పై ఒత్తిడి పెంచనుంది. క్యూబా ప్రభుత్వం నుంచి దూరం కావాలని దానిపై ట్రంప్ ఒత్తిడి చేస్తున్నారు. ఇటీవల మెక్సికో దేశాధ్యక్షురాలు క్లాడియా షేన్‌బామ్ మాట్లాడుతూ.. క్యూబాకు చమురు రవాణాను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, అమెరికా ఒత్తిడి కారణంగా ఈ నిర్ణయం తీసుకోలేదని ఆమె స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు