సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో ధర్మవరం టీడీపీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్
విశాలాంధ్ర ధర్మవరం; పేదవాడి ఆరోగ్యానికి కష్టం వస్తే..ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేనున్నానంటూ ఆదుకుంటున్నారని ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ తెలిపారు. పట్టణంలోని టిడిపి పార్టీ కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన పలువురికి వారు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. మొత్తం 16మందికి 14లక్షల 58వేల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. లబ్ధిదారులు పరిటాల శ్రీరామ్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ ఎవరికైనా పెద్ద జబ్బులు వస్తే ఆరోగ్యశ్రీ వర్తించక ఆర్థికంగా చాలా ఖర్చులు పెట్టుకుంటున్నారన్నారు. ఇలాంటి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించి, ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎంఆర్ఎఫ్ కింద ఆదుకుంటున్నారన్నారు. ఇప్పటికే వైద్యం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అనేక మార్పులు తీసుకొస్తున్నారని.. పేదలకు ఎలాంటి కష్టం వచ్చినా కూడా నేనున్నానంటూ సాయం అందిస్తున్నారన్నారు. ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే చాలా మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించారని.. ఈ సందర్బంగా నియోజకవర్గ ప్రజల తరుఫున ముఖ్యమంత్రి చంద్రబాబుకు శ్రీరామ్ ధన్యవాదాలు తెలిపారు.
పేదవాడి ఆరోగ్యానికి కష్టం వస్తే..ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారు
RELATED ARTICLES