Friday, April 4, 2025
Homeఆంధ్రప్రదేశ్ఏపీలో హెల్మెట్ పెట్టుకోకపోతే రూ.వెయ్యి జరిమానా..

ఏపీలో హెల్మెట్ పెట్టుకోకపోతే రూ.వెయ్యి జరిమానా..

అక్కడ మాత్రమే, హోంమంత్రి కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌లో ట్రాఫిక్ రూల్స్ విషయంలో పోలీసులు సీరియస్‌గా ఉన్నారు. మార్చి 1 నుంచి కొత్త రూల్‌ను అమలు చేస్తు్న్నారు.. హెల్మెట్ లేకపోతే రూ.వెయ్యి జరిమానా విధిస్తారని పోలీసులు ప్రకటించారు. ఈ అంశంపై విమర్శలు కూడా వచ్చాయి.. ఇలా వాహనదారులకు జరిమానా విధించడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ రూ.1000 జరిమానా వసూలు చేయడం పట్ల ప్రజల్లో అసంతృప్తి ఉందని కొందరు సభ్యులు శాసనమండలిలో ప్రస్తావించారు. దీంతో హోంమంత్రి అనిత ఈ అంశంపై స్పందించారు. బైక్ కొనాలంటే కనీసం లక్ష అవుతుందని.. అలాంటప్పుడు రూ.300తో హెల్మెట్ ఎందుకు కొని పెట్టుకోలేకపోతున్నారని ప్రశ్నించారు. అసలు హెల్మెట్ పెట్టుకోవడానికి వచ్చిన సమస్య ఏంటన్నారు. కేంద్రం 2020లో చేసిన చట్టం, సుప్రీంకోర్టు ఆదేశాలతో పోలీసులు రూ.వెయ్యి జరిమానా వసూలు చేస్తున్నట్లు హోంమంత్రి తెలిపారు. ఇటీవల రోడ్డు ప్రమాదాలతో కుటుంబాలు రోడ్డు పడ్డాయని.. ప్రజలు ప్రాణం ముఖ్యమా?.. రూ.వెయ్యి ముఖ్యమా అనే అంశాన్ని అర్థం చేసుకోవాలన్నారు. ప్రజల్లో మార్పుు తీసుకొచ్చేందుకు జరిమానాను రూ.100 నుంచి రూ.వెయ్యికి పెంచినట్లు తెలిపారు. హెల్మెట్‌ లేకపోవడం వల్ల 2021లో 2,577 మంది, 2022లో 3042 మంది, 2023లో 3108 మంది, 2024లో 3400 మంది చనిపోయారు.. క్షతగాత్రులు చాలామందే ఉన్నారు. అందుకే పట్టణాల్లోనే హెల్మెట్‌ తప్పనిసరి చేశాము.. అవగాహన సదస్సులు నిర్వహించాక రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తాము అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బైక్‌లు నడిపేవారు హెల్మెట్‌ను ను తప్పనిసరిగా ధరించాలన్న నిబంధనను పక్కాగా అమలు చేస్తున్నట్లు హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. రోడ్డు ప్రమాదాలతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని.. ఇవన్నీ గమనించే జరిమానాలు విధిస్తున్నట్లు చెప్పారు. ఈ రూ.వెయ్యి జరిమానాను రాష్ట్రవ్యాప్తంగా కాకుండా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ప్రయోగాత్మకంగా వసూలు చేస్తున్నామన్నారు. ప్రజల్లో పూర్తిగా అవగాహన కల్పించాకే జరిమానా పెంపు అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు హోంమంత్రి తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు