Wednesday, December 25, 2024
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిరైతు సంఘం నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం దారుణమైన చర్య

రైతు సంఘం నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం దారుణమైన చర్య

శ్రీ సత్య సాయి జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్
విశాలాంధ్ర ధర్మవరం: నూతన వ్యవసాయ మార్కెట్ చట్టమును తొలగించి రైతులకు న్యాయం చేయాలని కోరుతూ, ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోను దగ్ధం చేసే కార్యక్రమాన్ని ధర్మవరం పోలీసులు అడ్డుకోవడం దారుణమైన చర్యాని శ్రీ సత్యసాయి జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంయుక్త కిసాన్ మోర్చా పిలుపుమేరకు రైతు సంఘం నాయకులు నిరసన తెలిపేందుకు వస్తే, ముందస్తు చర్యగా రైతు సంఘం నాయకులను అడ్డుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం తప్పులు చేస్తున్నా కూడా, మిన్నకుండా ఉండడం ఎలా అని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఢిల్లీ రైతులను కేంద్ర ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులకు గురిచేసిందని, అటువంటి రైతుల సమస్యలను పట్టించుకోవాలన్న తపన ప్రభుత్వానికి లేకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఏది ఏమైనా నూతన వ్యవసాయ చట్టాన్ని తొలగించేంతవరకు పోరాటాలు ఆపమని, జిల్లా తరఫున ఎల్లప్పుడూ పోరాటాలు సలుపుతూనే ఉంటామని తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రైతులతో చర్చలు జరిపి, వారి సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తూ వారి అభివృద్ధికి పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు