విశాలాంధ్ర ధర్మవరం; అక్రమ సస్పెన్షన్ రిమూవర్షను వెంటనే ఆపాలని, అదేవిధంగా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించుటకు సత్వరమే చర్యలు చేపట్టాలని జోనల్ కార్యదర్శి చెన్నారెడ్డి ఈ సందర్భంగా నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కారణ కోసం రిలే నిరాహార దీక్షలు రెండవ రోజుకు చేరుకున్నాయి. ఈ రెండవ రోజు దీక్ష కొనసాగిస్తున్న వారికి సంఘీభావం తెలపడానికి కడప జోనల్ కార్యదర్శి చెన్నారెడ్డి, సత్యసాయి జిల్లా అధ్యక్షులు శ్రీరాం నాయక్, రీజినల్ కార్యదర్శి షబ్బీర్, రీజినల్ జాయింట్ సెక్రెటరీ రవి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమం డిపో కార్యదర్శి మధుసూదన్ ఆధ్వర్యంలో జరిగింది. అనంతరం నాయకులు మాట్లాడుతూ ఈ నిరాహార దీక్ష శిబిరంలో డిపో చైర్మన్ హనుమాన్, డిపో అధ్యక్షులు ప్రభాకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం ఎం రత్నం, సీనియర్ నాయకులు నారాయణస్వామి నిరాహార దీక్షలో పాల్గొనడం జరిగిందని తెలిపారు. దీక్షలో పాల్గొన్న వారందరికీ సంఘీభావం తెలిపేందుకు వచ్చిన వారు పూలమాల వేసి అభినందనలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ హెచ్ ఎస్ స్థానంలో పాత వైద్య విధానాన్ని అమలు చేయాలని, ఉద్యోగుల ఉద్యోగ భద్రత సర్కులర్ అన్ని డిపాలలో వెంటనే అమలు చేయాలని, ఆగిపోయిన ప్రమోషన్ ను వెంటనే ప్రకటించాలని, మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవులను వెంటనే మంజూరు చేయాలని తెలిపారు. గ్యారేజ్ ఉద్యోగుల సమస్యలు కార్యాలయ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించే దిశలో కృషి చేయాలని తెలిపారు. గత నాలుగు సంవత్సరాలుగా ఆగిపోయిన పదోన్నతులను వెంటనే నిర్వహించాలని, మెమరాండం నందలి 38 సమస్యలను పరిష్కరించే దిశలో కృషి చేయకపోతే నిరాహార దీక్షలు ఆగవు అని వారు హెచ్చరించారు. ఏపీఎస్ఆర్టీసీలో మాదిరిగానే క్యాడర్ స్ట్రెంత్ అమలు చేయాలని, నైట్ అవుట్ అలవెన్స్లను 150 రూపాయల నుండి 400 రూపాయలకు పెంచాలని, ఎలక్ట్రికల్ బస్సులను ప్రభుత్వమూ లేదా సంస్థ ద్వారా మాత్రమే కొనుగోలు చేయాలని, అనారోగ్యంతో బాధపడుతున్న ఉద్యోగులకు ఓడీలను కేటాయించాలని వారు తెలిపారు. పారదర్శకమైన ట్రాన్స్ఫర్ పాలసీని అమలు చేయాలని, ఉద్యోగుల అవసరాన్ని బట్టి ఈఓఎల్ మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రీజినల్ నాయకులు ఎస్ఎం సాబ్, మోహన, దుర్గాప్రసాద్, నాగప్ప, గ్యారేజ్ అధ్యక్షులు కుమార్, డిపో కోశాధికారి వైవియన్ రెడ్డి, సీనియర్ నాయకులు ఖాన్, మాధవ, ఎం సి జి రావు, నాయక్, మంజునాథ్, భాస్కర్ అధిక సంఖ్యలో డిపో సభ్యులు పాల్గొన్నారు.
అక్రమ సస్పెన్స్లు, రిమూవల్స్ వెంటనే ఆపాలి.. డిపో సెక్రటరీ మధుసూదన్
RELATED ARTICLES