Saturday, February 22, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఎల్ఐసి లో తక్షణం నియామకాలు చేపట్టాలి.. క్లాస్ 3 ఉద్యోగులు

ఎల్ఐసి లో తక్షణం నియామకాలు చేపట్టాలి.. క్లాస్ 3 ఉద్యోగులు

విశాలాంధ్ర -ధర్మవరం : ఎల్ఐసి లో తక్షణం నియామకాలు చేపట్టాలని, అఖిల భారత ఉద్యోగుల సంఘానికి గుర్తింపు ఇవ్వాలని కోరుతూ , ఎల్ఐసి ధర్మవరం శాఖ క్లాస్ 3 ఉద్యోగులు ఒక గంట వాకౌట్ సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా, సంఘం అధ్యక్షులు సి.ఆంజనేయులు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో యూనియన్ సెక్రటరీ యి.రవీంద్ర మాట్లాడుతూ రిటైర్మెంట్ తదితర కారణాల దృష్ట్యా సంస్థలో ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గడంవలన , పాలసీ దారుల సేవలకు అంతరాయం కలుగుతోందని తెలిపారు. ఎల్ఐసి లో 80 శాతానికి పైగా ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న అఖిల భారత బీమా ఉద్యోగుల సంఘం కు తక్షణమే గుర్తింపు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధనకు ఒక గంట సమ్మెకు మద్దతుగా ఉద్యోగులందరూ సంపూర్ణంగా పాల్గొంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు, ఆనందరావు, పిఎం భాషా, సి.రామన్న, కే.నాగరాజు, కే.రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు