విశాలాంధ్ర ధర్మవరం ; శ్రీరామనవమి సందర్భంగా పట్టణంలోని ఎర్రగుంట లో గల శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానమునందు నిర్వహించినటువంటి మానస నృత్య కళా కేంద్రం ఆధ్వర్యంలో శిష్య బృందం ఆలపించిన నాట్య ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది. ఈ సందర్భంగా నాట్య గురువు మానస మాట్లాడుతూ పండుగ సందర్భంగా మా నృత్య కళా కేంద్రాన్ని ఆహ్వానించడం పట్ల వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈనాటి ప్రదర్శనలో 20 మంది చిన్నారులు నిర్వహించిన నృత్యాలు అందరిని అబ్బురపరిచింది అని తెలిపారు. శ్రీరామచంద్రుని సంకీర్తనలతో చిన్నారుల నృత్యం చూసిన భక్తాదులు విశేషంగా తమ భక్తి భావాన్ని చప్పట్లతో మారుమోగించారు అని తెలిపారు. అనంతరం గురువు మానసను ఆలయ కమిటీ వారు సత్కరించారు. 20 మంది చిన్నారులకు ప్రశంసా పత్రాలను ఆలయ కమిటీ వారు అందజేశారు.
ఆకట్టుకున్న చిన్నారుల నృత్య ప్రదర్శన.. నాట్య గురువు మానస
RELATED ARTICLES