Thursday, January 9, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఆకట్టుకున్న సంక్రాంతి ముగ్గుల పోటీలు..

ఆకట్టుకున్న సంక్రాంతి ముగ్గుల పోటీలు..

అధ్యక్షులు వీరనారాయణ
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని పుట్టపర్తి రోడ్డు, సాయి నగర్ లో గల శ్రీ శిరిడి సాయిబాబా ఆలయంలో, శ్రీ షిరిడి సేవా సమితి కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని అధ్యక్షులు వీరనారాయణ, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలను ఘనంగా నిర్వహించారు. అనంతరం అధ్యక్షుడు వీరనారాయణ మాట్లాడుతూ ఈ పోటీల్లో 20 మంది మహిళలు పాల్గొనడం జరిగిందని, ముగ్గుల పోటీలలో ప్రతిభ ఘనపరిచిన వారికి బహుమతులు కూడా పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఇందులో మొదటి బహుమతి ప్రసన్నలక్ష్మి, ద్వితీయ బహుమతి పావని, తృతీయ బహుమతి కళావితులకు ఆలయ కమిటీ ప్రతినిధులు బహుమతులను అందజేయడం జరిగిందన్నారు. ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు టిసి నారాయణరెడ్డి కోశాధికారి జయ సూర్యనారాయణ, డైరెక్టర్లు సూర్యప్రకాశ్, రాంప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు