విశాలాంధ్ర – చోడవరం(అనకాపల్లి జిల్లా) : చోడవరం (గోవాడ) సహకార చక్కెర కర్మాగారం కార్మికులు కర్షకుల బకాయిలు చెల్లించేందుకు ఫ్యాక్టరీ మేనేజింగ్ డైరెక్టర్ వి. సన్యాసినాయుడు స్పష్టమైన హామీతో కార్మికులు కార్మికులు జరుపుతున్న ఆందోళనను శుక్రవారం విరమించారు. దీనిపై సుగర్స్ ఎంప్లాయిస్ మరియు కార్మికుల యూనియన్ అధ్యక్షుడు కె.భాస్కరరావు మాట్లాడుతూ ఫ్యాక్టరీ యాజమాన్యం కార్మికులకు సుమారు అయిదు కోట్ల రూపాయలు వరకు వేతన బకాయిలు ఉన్నాయని అన్నారు. కార్మికులు, సబ్జా రైతుల బకాయి చెల్లింపులు కోసం రెండు రోజులుగా ఫ్యాక్టరీ ఆవరణలో ఆందోళన చేపడుతున్నామని తెలిపారు. కార్మికులకు రావలసిన డి ఎ పాయింట్లు పెంపుదల, వేతన బకాయిలు పై చేస్తున్న నిరసన లకు శుక్రవారం ఎండి వి ఎస్ నాయుడు, వివిధ విభాగాల అధిపతులు హాజరై కార్మికుల సమస్యల ను అడిగి తెలుసుకున్నారు. ఫ్యాక్టరీ కి వివిధ వర్గాల నుండి రావలసిన బకాయిలు రాగానే రైతులకు, కార్మికులకు ప్రయారిటీ మీద చెల్లింపులు చేయడానికి హామీ ఇచ్చారన్నారు. 2024 సంవత్సరానికి పెరిగవలసిన డి.ఏ. పాయింట్లు మొత్తం నవంబర్ నెల జీతం లో కలిపి జనవరి నించి రావలసిన ఎరియర్స్ కలిపి చెల్లిస్తామని, సిబ్బందికి మరియు కాంట్రాక్టు సోదరులకు బకాయి ఉన్న ఓవర్ టైం బకాయిలు, రిటైర్ అయిన సోదరుల గ్రాడ్యూటీే బకాయిలు తొందరలో చెల్లిస్తామని, ఆందోళనలో పాల్గొన్న కార్మికులు అందరి సమక్షం లో హామీ ఇచ్చారని తెలియజేశారు. ఈ నిరసన కార్యక్రమం లో పాల్గొన్న కార్మిక నాయకులు రాపేటి జగన్నాథ రావు, బండి శ్రీను, ప్రకాష్, రమణ, టైగర్ అప్పారావు, నూకరాజు మరియు ఉద్యోగ కార్మిక సోదర, సోదరీమణులు అందరికీ పేరు పేరునా ధన్యవాదములు తెలియజేశారు.