Homeజిల్లాలుశ్రీ సత్యసాయిస్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ధర్మవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ట్రబుల్ మాంగర్స్, రౌడీషీటర్లకు కౌన్సెలింగ్..

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ధర్మవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ట్రబుల్ మాంగర్స్, రౌడీషీటర్లకు కౌన్సెలింగ్..

- Advertisement -

వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ రెడ్డప్ప
విశాలాంధ్ర ధర్మవరం;!శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ గారు స్థానిక ఎన్నికలు పై ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగా ధర్మవరం మున్సిపాలిటీ ఎన్నికలలో ఎలాంటి గొడవలు అల్లర్లు జరగకుండా ముందస్తుగా రౌడీ షీటర్లు ట్రబుల్ మంగర్స్ కు పోలీసులు తీవ్రస్థాయిలో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. ధర్మవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఈరోజు అడిషనల్ ఎస్పీ కె.వి. మహేష్ ట్రబుల్ మాంగర్స్, రౌడీషీటర్లను ధర్మవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు పిలిపించి భౌతికంగా కౌన్సెలింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా సహకరించాలని తెలిపారు. ఎవరైనా నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులు ఓటర్లను బెదిరించడం, భయభ్రాంతులకు గురిచేయడం, ప్రలోభాలకు గురిచేయడం లేదా ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించే చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
అటువంటి వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, నిబంధనల మేరకు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
అక్టోబర్ నెల 18వ తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఎన్నికల ప్రవర్తనా నియమావళి నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నామినేషన్ల దాఖలు సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడరాదని, చట్టాన్ని అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ధర్మవరం ప్రాంతంపై పోలీసులు నిరంతరం డ్రోన్ సిసి కెమెరాల ద్వారా ప్రత్యేక నిఘా ఉంచుతారని తెలిపారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని, ఎన్నికలకు సంబంధించి ఏవైనా బెదిరింపులు లేదా అక్రమాలు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.ఎన్నికల ప్రశాంతతకు భంగం కలిగించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. ఎస్ ఎస్ పి గారు వెంట వన్ టౌన్ సిఐ రెడ్డప్ప, సిబ్బంది ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు