Homeక్రీడలుIndia vs Afghanistan: క్రికెట్ ప్రసారాల్లో కొత్త విప్లవం.. ఫిఫా టెక్నాలజీతో ఇండియా-ఆఫ్ఘ‌న్ సిరీస్!

India vs Afghanistan: క్రికెట్ ప్రసారాల్లో కొత్త విప్లవం.. ఫిఫా టెక్నాలజీతో ఇండియా-ఆఫ్ఘ‌న్ సిరీస్!

- Advertisement -

క్రికెట్ ప్రసారాల్లో సరికొత్త విప్లవానికి భారత్, ఆఫ్ఘనిస్థాన్ టీ20 సిరీస్ వేదిక కానుంది.సెప్టెంబర్‌లో జరగనున్న ఈ సిరీస్‌ను.. ఇటీవల జరిగిన ఫిఫా ఫుట్‌ బాల్ ప్రపంచకప్ తరహాలో అత్యాధునిక సాంకేతికతతో ప్రసారం చేసేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ సిరీస్ ప్రసార హక్కులను దక్కించుకున్న ఐటీడబ్ల్యూ యూనివర్స్ సంస్థ.. ఇప్పటివరకు క్రికెట్ ప్రసారాల్లో చూడని సరికొత్త అనుభూతిని ప్రేక్షకులకు అందించేందుకు సిద్ధమవుతోంది.క్రిక్‌బజ్ కథనం ప్రకారం.. ఈ సిరీస్ ప్రసారంలో పలు విప్లవాత్మక సాంకేతికతలను తొలిసారిగా ఉపయోగించనున్నారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత స్టెబిలైజ్డ్ కెమెరాలు, వాల్యూమెట్రిక్ ఫ్రీ-వ్యూపాయింట్ టెక్నాలజీ, అత్యాధునిక స్పైడర్‌క్యామ్, అల్ట్రా-మోషన్, సినిమాటిక్ స్టోరీ టెల్లింగ్ వంటి ఫీచర్లను ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లో తొలిసారిగా అందుబాటులోకి తీసుకురానున్నారు.

ప్రసారాల్లో ఉపయోగించిన ‘స్పాటియో’..
అంతేకాకుండా క్విడిచ్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ రూపొందించిన ‘స్పాటియో’ సిస్టమ్‌ను కూడా ప్రసారాల్లో ఉపయోగించనున్నారు.ఈ టెక్నాలజీ ద్వారా డ్రోన్ ఫీడ్‌పై ఆగ్మెంటెడ్ రియాలిటీ గ్రాఫిక్స్‌ను జోడించవచ్చు.అలాగే ఆటగాళ్ల కదలికలను రియల్‌టైమ్‌లో ట్రాక్ చేసే అవకాశం ఉంటుంది.దీంతో మైదానంలో ఫీల్డింగ్ అమరిక, ఆటగాళ్ల వ్యూహాలను మరింత వినూత్నంగా, స్పష్టంగా ప్రేక్షకులకు చూపించవచ్చు.2002 నుంచి ప్రతి ఫిఫా ప్రపంచకప్‌లో పనిచేసిన ఆయన.. 2014 ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఫైనల్‌కు కూడా డైరెక్టర్‌గా వ్యవహరించారు.”ఒక ద్వైపాక్షిక సిరీస్‌ను పూర్తిస్థాయి ఫిఫా ప్రపంచకప్ ప్రసార ప్రమాణాలతో నిర్మించడం ఇదే తొలిసారి. ప్రపంచకప్ ఫైనల్స్‌కు పనిచేసిన నిపుణులే ఈ సిరీస్ కోసం పనిచేస్తారు” అని ఐటీడబ్ల్యూ యూనివర్స్ ఓ ప్రకటనలో తెలిపింది.

భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్..
“ప్రేక్షకులకు మైదానంలో అత్యుత్తమ సీటులో కూర్చొని మ్యాచ్ చూస్తున్న అనుభూతిని కల్పించడమే మా లక్ష్యం” అని సంస్థ వ్యవస్థాపకుడు భైరవ్ శాంత్ తెలిపారు.భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ సెప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో జరగనుంది.ఈ మూడు మ్యాచ్‌లకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.ఈ సిరీస్‌లో ఆఫ్ఘనిస్థాన్ జట్టు అధికారిక ఆతిథ్య జట్టుగా వ్యవహరించనుండటం విశేషం.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు