Tuesday, May 20, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయి650-2 సర్వే నెంబర్లొ అనర్హులను వెంటనే తొలగించాలి..

650-2 సర్వే నెంబర్లొ అనర్హులను వెంటనే తొలగించాలి..

సిపిఐ పార్టీ కార్యదర్శి మధు

విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని 650-2 సర్వే నెంబర్లు అనర్హులను వెంటనే తొలగించాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు తెలిపారు. ఈ సందర్భంగా తాసిల్దార్ కార్యాలయ ఆవరణ ముందు ఏఐటియుసి, కార్మిక సంఘం, ప్లంబర్ అండ్ ఎలక్ట్రిషన్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రిలే దీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ గత రెండు నెలలుగా ధర్మవరం పట్టణంలో 650-2, సర్వే నెంబర్ లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై విచారణ చేపట్టాలని, ఉద్యమాలు చేస్తున్నాము అని అధికారులకు చీమకుట్టినట్లు కూడా లేకపోవడం దారుణమని అన్నారు.ఎమ్మార్వో , ఆర్టీవో , కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం,అయినా కూడా ఏ ఒక్క అధికారి కూడా కార్మికుల సమస్యలు పట్టించుకున్న పాపాన పోలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులను మాత్రం ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం అని వారు ప్రశ్నించారు. ఆర్డీవో ఎందుకు ఈ విషయం పైన విచారణ చేపకట్టకుండా కాలయాపన చేయడం ధారణము కాదా? అని వారు ప్రశ్నించారు. రాజకీయ నాయకుల ఒత్తిడి తట్టుకోలేక కార్మికుల కోసం పనిచేయడం లేదా,ఆయన ఏమైనా ముడుపులు తీసుకొని పనిచేయడం లేదా మాకు అర్థం కావడం లేదు అని తెలిపారు. మరి ఇప్పటికైనా ఆర్టీవో మొద్దు నిద్ర వీడి వెంటనే స్పందించి 650-2 సర్వే నెంబర్ లో ఎవరైతే అనర్హులు ఉన్నారో వారిని వెంటనే తొలగించి, వారి దొంగ పట్టాలను రద్దుచేసి, అర్హులైన ప్లంబర్స్ కార్మికులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోకపోతే రాబోయే కాలంలో అధికారుల్ని రోడ్డు మీదికి తీసుకొచ్చే విధంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ గా ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని, రెవెన్యూ కార్యాలయాల్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవికుమార్, ఏఐటీయూసీ కార్మిక సంఘం నాయకులు ఎర్రం శెట్టి రమణ, ప్లంబర్స్ అండ్ ఎలక్ట్రిషన్ కార్మిక సంఘం అధ్యక్షులు, గోవిందరాజులు, కార్యదర్శి అన్నం లక్ష్మీనారాయణ, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆంజనేయులు, చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకటనారాయణ, తాజా ఉద్దీన్, సురేంద్ర, మసూద్, చిన్న ,నాగేంద్ర, శ్రీనివాసులు, మహిళా సమైక్య నాయకులు లలితమ్మ, లింగమ్మ, ఈరమ్మ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు