విశాలాంధ్ర -ధర్మవరం:: పట్టణంలోని బత్తలపల్లి రోడ్ మార్కెట్ యార్డులో గల పౌరసరఫరాల గోడౌను ఆర్డీవో మహేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నీలో ఉన్న నిత్యావసర సరుకులు కూడా వారు పరిశీలించారు. అనంతరం రికార్డులను తనిఖీ చేసి స్టాకు నిల్వ, విక్రయ నిల్వలను పరిశీలించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే స్టోర్లకు తగిన నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని, ఎక్కడ ఇటువంటి పొరపాట్లకు తావు ఇవ్వకుండా ఉండాలని సిబ్బందికి సూచించారు. నిర్లక్ష్యం వహించకుండా ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతపరచడానికి అధికారులందరూ కూడా సమన్వయంతో పని చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోడౌన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.