Monday, March 31, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఈవీఎం గోడౌన్ల తనిఖీ

ఈవీఎం గోడౌన్ల తనిఖీ

విశాలాంధ్ర ధర్మవరం; ధర్మవరంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు ఉన్న ఈవీఎం యంత్రాలు, వివిప్యాట్ భధ్రపరిచే గోడౌన్‌ను జిల్లా కలెక్టర్‌ టీఎస్ చేతన్ శనివారం తనిఖీ చేశారు.గోడౌన్‌కు వేసిన సీళ్లను ఈవీఎంల రక్షణ, భధ్రతకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు.అనంతరం పర్యవేక్షణ రిజిష్టర్ లో జిల్లా కలెక్టర్ సంతకం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాలు మేరకు ఎప్పటి కప్పుడు ఈవీఎం, వీవీప్యాట్ గోదాంను క్షుణ్ణంగా తనిఖీ చేసి సమగ్ర నివేదికను పంపిస్తున్నట్లు తెలిపారు. ఈవీఎం గోదాం వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈ తనిఖీ జరిగింది అని తెలిపారు.జిల్లా కలెక్టర్ వెంట ధర్మవరం ఆర్డీవో మహేష్, ధర్మవరం ఎమ్మార్వో నటరాజ్, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ఖలీమ్, బీఎస్పీ పార్టీ ప్రతినిధి వినయ్ కుమార్, బిజెపి పార్టీ ప్రతినిధి చంద్రశేఖర్, సాకే ఓబులేష్ ,టిడిపి పార్టీ ప్రతినిధి ఫక్రుద్దీన్, జనసేన పార్టీ ప్రతినిధి రామాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు