అఖిల భారత యువజన సమైక్య
విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం పట్టణంలో స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాలని ఆర్డీవో కార్యాలయ ఏవో. ఖ తీజూన్ కు వినతి పత్రాన్ని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి సకలరాజా అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పట్టణంలో స్పీడ్ బ్రేకర్లు లేకపోవడంi వాలా వాహనదారులు, వేగంగా వెళ్లడం వలన చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇలాంటి ప్రమాదాలు అరికట్టాలంటే పట్టణంలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని రద్దీ ప్రదేశాల్లో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. గతంలో చాలాసార్లు సంబంధిత ఆర్ అండ్ బి అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోయిందని తెలిపారు. కావున వేగవంతంగా స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడానికి కఠిన చర్యలు కచ్చితంగా తీసుకోవాలని వారు తెలిపారు.
ధర్మవరంలో స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయండి..
- Advertisement -
RELATED ARTICLES


