Thursday, April 17, 2025
Homeఆంధ్రప్రదేశ్రేపే ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు

రేపే ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు

ఏపీలోని ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్. రేపు ఇంటర్ ఫలితాలను రిలీజ్ చేస్తున్నట్లు మంత్రి నారాలోకేశ్ తెలిపారు. ఉదయం 11గంటలకు ఇంటర్ మొదటి, రెండవ సంవత్సర ఫలితాలను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఫలితాలను https://resultsbie.ap.gov.in/ వెబ్ సైట్లో చూసుకోవచ్చు. కాగా,ఫలితాలతో పాటు మార్క్ మెమోలను సైతం విద్యార్ధులకు వాట్స్ ప్ ద్వారా పంపనున్నట్లు ఇంటర్ అధికారులు వెల్లడించారు..

మొదటి సంవత్సరం పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి 19వ తేదీ నిర్వహించగా.. రెండో సంవత్సరం ఇంటర్ ఎగ్జామ్స్ మార్చి 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించారు. ఇక విద్యార్థులకు పరీక్ష ఫలితాలు తెలుసుకునేందుకు మల్టిపుల్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్‌లో వాట్సాప్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా సులభంగా ఫలితాలను తెలుసుకోవచ్చు. ఏపీ ఇంటర్ ఎగ్జామ్స్ ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా bieap.gov. in  అధికారిక వెబ్సైట్లో సులభంగా తెలుసుకోవచ్చు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు