Homeఆంధ్రప్రదేశ్ఘనంగా అంతర్జాతీయ బాలికా దినోత్సవం

ఘనంగా అంతర్జాతీయ బాలికా దినోత్సవం

- Advertisement -

విశాలాంధ్ర – కడియం : అంతర్జాతీయంగా బాలికలు ఎదుర్కొంటున్న విద్య, పోషకాహారం, బాల్యవివాహాలు, వైద్యం, చట్టపరమైన హక్కులు తదితర అంశాలపై బాలికలకు అవగాహన కల్పించడమే అంతర్జాతీయ బాలికా దినోత్సవ ముఖ్య ఉద్దేశ్యమని కడియం జిల్లా పరిషత్ హైస్కూల్ హెచ్ఎం టి సత్యనారాయణ అన్నారు. శుక్రవారం కడియం జిల్లా పరిషత్ హైస్కూల్ లో అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ రాజానగరం వారి ఆధ్వర్యంలో  విద్యార్ధినీలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికలు ఎదుర్కొంటున్న సవాళ్లను తగ్గించి, వారి హక్కులను ప్రోత్సహించాలని, లింగ సమానత్వాన్ని పెంపొందించాలని అన్నారు. ఈ సందర్భంగా బాలికలకు బాల్యవివాహాలు, సెల్ ఫోన్ వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు బూసి సువర్ణవేణి, డీసీపీ యూనిట్ ఎస్ పావని,  సూపర్వైజర్ నాగలక్ష్మి, శిరీష దేవి,  అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు