Wednesday, March 12, 2025
Homeజిల్లాలుఎన్టీఆర్ జిల్లాశ్రీ సెవెన్‌ హిల్స్‌ ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

శ్రీ సెవెన్‌ హిల్స్‌ ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

విజయవాడ సీతారాంపురంలోని శ్రీ సెవెన్‌ హిల్స్‌ ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా శనివారం పాఠశాల యాజమాన్యం విద్యార్థినీ విద్యార్థుల తల్లులను పాఠశాలకు ఆహ్వానించి వారికి పలు పోటీలను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి శ్రీమతి షణత్‌ క్రిష్ణ గారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సాంప్రదాయ వస్త్రధారణ, పాటల పోటీ, అంత్యాక్షరి, ఆటల పోటీలలో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. రామచంద్ర మిషన్‌ (Heartfulness) చెందిన ప్రశిక్షకులు శ్రీమతి యు.రమగారు, జి.సాయి కుమారి గారు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించి, మహిళలకు చక్కని సందేశాన్ని అందజేశారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు.న్యాయ నిర్ణేతలను ప్రధానోపాధ్యాయులు శ్రీ రామకృష్ణా రావు గారు ఘనంగా సత్కరించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు