Friday, April 18, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిక్షయ వ్యాధిపై ఇంటిటా సర్వే..

క్షయ వ్యాధిపై ఇంటిటా సర్వే..

డబ్ల్యు హెచ్చ్ఓ- కన్సలెంట్ డాక్టర్ జి ఎన్ ప్రశాంత్
విశాలాంధ్ర- ధర్మవరం ; మండల పరిధిలోని దర్శనమల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఏలుకుంట్ల గ్రామంలో యాక్టివ్ టీవీ కేస్ ఫైండింగ్ లో భాగంగా డబ్ల్యు హెచ్చ్ఓ కన్సలెంట్ డాక్టర్.జిఎన్. ప్రశాంత్ క్షయ వ్యాధి పై ఇంటిట సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా వారు అక్కడి గ్రామ ప్రజలకు క్షయ వ్యాధి లక్షణాలు వాటి నివారణ పై అవగాహన కల్పించారు. రెండు వారాలకు మించిద గ్గు ఉండడం, సాయంత్రం పూట జ్వరం రావడం, బరువు తగ్గిపోవడం, ఆకలి లేకపోవడం లాంటివి శ్రేయ వ్యాధి లక్షణాలు అని తెలిపారు. ఈ లక్షణాలు ఉన్న వారిని గుర్తించి వారి యొక్క గళ్ళ నమూనాలను సేకరించి పరీక్ష కేంద్రానికి పంపడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జయ పర్యవేక్షకులు మల్లికార్జున, నాగేంద్ర, ఆంజనేయులు, హెల్త్ సూపర్వైజర్ రాజశేఖర్ రెడ్డి, ధర్మవరం సూపర్వైజర్ రహమత్ భాష, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు